ఆ హత్యకు టీడీపీ నేతలే కారణం: తలారి రంగయ్య
ATP: కళ్యాణదుర్గంలో జరిగిన పరువు హత్యపై మాజీ ఎంపీ తలారి రంగయ్య తీవ్రంగా స్పందించారు. బోయ ఆనంద్‌ను బెంగళూరు నుంచి పిలిపించి, దారుణంగా హత్య చేశారని, దీనికి స్థానిక టీడీపీ నేతలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.