మధ్య భారతంలో మావోయిస్టు అగ్రనేతలు నిల్
మావోయిస్టు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు లొంగుబాటుతో మధ్య భారతంలో మావోయిస్టు అగ్ర నాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికే బీజాపూర్‌లో పాపారావు వంటి కీలక నేతలు బయటకు రావడంతో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం TG, మహారాష్ట్ర, MMC ప్రాంతాల్లో అగ్రశ్రేణి నేతలెవరూ క్రియాశీలకంగా లేకపోవడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.