నేడు పైడిమాంబ అమ్మవారి పండగ

నేడు పైడిమాంబ అమ్మవారి పండగ

AKP: మండల కేంద్రమైన పరవాడలో పైడిమాంబ అమ్మవారి నెల పండగను ఇవాళ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. భక్తులు పసుపు, కుంకుమ సమర్పించుకోవడానికి వీలుగా ఆలయ వద్ద ఏర్పాట్లు చేసామన్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.