మహిళా సర్పంచ్‌కు అవమానం

మహిళా సర్పంచ్‌కు అవమానం

NRPT: మరికల్ మండలం కన్మనర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో బీజేపీ మహిళా సర్పంచ్ అంకితకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ తన పట్ల దురుసుగా ప్రవర్తించి, కత్తెర లాక్కొని అవమానించారని ఆమె ఆరోపించారు. మహిళా ప్రతినిధిని గౌరవించకుండా ప్రవర్తించిన సదరు నాయకుడిపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.