వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లు.. రక్షించిన NDRF సిబ్బంది

KMR: నిజాంసాగర్,లెండి ప్రాజెక్టుల్లోనూ వరద భారీగా వచ్చి చేరుతోంది. బిచ్కుంద మండలంలోని శెట్లూరు వాగు వద్ద మంజీరలో సుమారు 500 గొర్రెలను, ముగ్గురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అప్రమత్తమయ్యారు. NDRF సిబ్బంది తాడుసాయంతో గొర్రెల కాపర్లను సురక్షితంగా రక్షించారు.