'లోకేష్ కృషి ప్రశంసనీయం'

'లోకేష్ కృషి ప్రశంసనీయం'

కృష్ణా: నేపాల్లో చిక్కుకున్న 144 మంది తెలుగు వారిని స్వస్థలాలకు తరలించడంలో మంత్రి నారా లోకేష్ కృషి ప్రశంసనీయమని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగువారి సంక్షేమమే టీడీపీ అజెండా అని, వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునేందుకు పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. లోకేష్ రేయింబవళ్లు కృషి చేయడం వల్లే సాధ్యమైందని కొల్లు రవీంద్ర అన్నారు.