రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
NZB: కమ్మర్ పల్లి మండలం హసకొత్తూరు ఉన్నత పాఠశాలకు చెందిన ప్రతిభ, ఆశ్రీత రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయరాలు అరుణ శ్రీ బుధవారం తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చడంతో ఇద్దరిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారన్నారు. సంగారెడ్డిలో ఈ నెల 7 నుంచి మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.