వీధికుక్కల బెడద.. ఇబ్బందులలో స్థానికులు
అన్నమయ్య: తంబళ్లపల్లెలో వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. రోడ్లపై గుంపులుగా తిరిగే కుక్కలు వాహనాలకు అడ్డుగా వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నామన్నారు. మంగళవారం రాగిమాను కూడలి వద్ద వీధికుక్కల గుంపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు.