మూడేళ్ల బాలుడు పై కుక్కల దాడి

NRML: బైంసా మండలంలోని మూడేళ్ల బాలుడు పై కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. దేగాం గ్రామ సమీపంలో గల ఇటుక బట్టి వద్ద నివాసముంటున్న గఫూర్ కుమారుడైన అబ్దుల్ అమీర్ ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేశాయి. బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.