జూలై నెల రికవరీ వివరాలు వెల్లడించిన సీపీ

విశాఖలో జూలై నెలకు సంబధించి రూ. 1,20,58,150 సొత్తును రికవరీ చేసినట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జూలై నెలలో 64 కేసులు రికవరీ జరిగినట్లు వివరించారు. వీటిలో 1.26కేజీల బంగారం, 1.92 కేజీల వెండి, రూ. 14,32,350 నగదు, 15 మోటార్ సైకిల్స్, 2కార్లు, 1 ఆటో, 259 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్‌టాప్ రికవరీ చేసినట్లు వెల్లడించారు.