చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
MHBD: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన గార్ల మండలంలో మంగళవారం జరిగింది. గోపాలపురం గ్రామానికి చెందిన కాంపాటి ఉపేందర్ (32) మంగళవారం చేపల వేటకోసం అప్ప సముద్రం చెరువులోకి వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.