నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత
VSP: అక్కయ్యపాలెం పరిధిలోని 11కేవీ రామాలయం ఫీడర్ మరమ్మతుల కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. అక్కయ్యపాలెం చిన్నూరు మజీద్, శంకువనిపాలెం, 80 అడుగుల రోడ్డు, జగ్గారావు బ్రిడ్జి ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.