సీసీ రోడ్డు పనులకు భూమిపూజ
ADB: గుడిహత్నూర్ మండలంలో NREGS నిధులతో మండల కేంద్రంలోని వార్డ్ నంబర్ 10లో సీసీ రోడ్డు నిర్మాణానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కేంద్రే శివాజీ, ఉపసర్పంచ్ నిఖిల్, బీజేవైఎం నాయకులు రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.