మురమండ, దుళ్ల కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు
E.G: కడియం మండలం మురమండ, దుళ్లలో గ్రేడ్-2 గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న రావిపాటి సత్యనారాయణ, బిక్కి సత్యానందకుమార్ లకు గ్రేడ్-1 కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ 2 పరిధిలో ఉన్న వీరిలో సత్యనారాయణను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నియమించగా.. సత్యానంద కుమార్‌ను తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు.