బుచ్చి సీఐ వినూత్న అవగాహన కార్యక్రమం

బుచ్చి సీఐ వినూత్న అవగాహన కార్యక్రమం

NLE: బుచ్చి సీఐ శ్రీనివాసరావు ప్రజల్లో నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తున్నారు. సాధారణంగా పోలీసుల ద్వారా అవగాహన కల్పించడం కాకుండా, మోసాలకు గురైన బాధితులనే ముందుకు తీసుకు వచ్చి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. యువకులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులు అలాంటి మోసాలకు గురికాకుండా హెచ్చరిస్తున్నారు.