వంశీ బెయిల్ పిటిషన్లు వాయిదా

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఎస్సీ, ఎస్టీ కోర్టులో గురువారం విచారణకు వచ్చి, ప్రాసిక్యూషన్ విజ్ఞప్తితో సోమవారానికి వాయిదా వేయగా, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు సీఐడి కోర్టులో ఈ నెల 23కి వాయిదా పడింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.