నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం
VZM: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాడు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రూ.1200 కోట్లను విడుదల చేయడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో TNSF ఆధ్వర్యంలో విద్యార్థులు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థులు మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.