VIDEO: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
KDP: ఖాజీపేట మండలం సీతా నగరం గ్రామానికి చెందిన కలసపాడు భీముడు (వయసు 38) ఖాజీపేట నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, పత్తూరు బైపాస్ రోడ్డులో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీముడు అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొట్టిన వాహన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరి విలపించారు.