ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రకారం సెలవులు ఖరారు
MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు పోలింగ్ కోసం ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలకు ప్రభుత్వ సెలవు ప్రకటించామన్నారు. పోలింగ్ రోజు ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర ఉద్యోగులకు స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.