315 మంది గైర్హాజరు

315 మంది గైర్హాజరు

TPT: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 21,379 మంది విద్యార్థులకు గాను 21,064 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 315 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.