డిగ్రీ పరీక్షల తనిఖీల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

డిగ్రీ పరీక్షల తనిఖీల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

KDP: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలను గురువారం హై పవర్ కమిటీ ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో సుండుపల్లె వీరభద్ర డిగ్రీ కళాశాలలో ఒకరిని, పుల్లారెడ్డిపేట ఎస్. ఎల్. ఎస్ డిగ్రీ కళాశాలలో ఇద్దరిని అక్రమాలకు పాల్పడినందుకు బహిష్కరించినట్లు సీఈ ప్రొఫెసర్ కె. ఎస్. వి. కృష్ణారావు తెలిపారు.