అర్జీలను స్వీకరించిన కలెక్టర్

అర్జీలను స్వీకరించిన కలెక్టర్

చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డీఆర్డీ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మిలు వినతులు స్వీకరించారు.