VIDEO: ప్రమాదకర స్థితిలో వాటర్ ట్యాంక్

VIDEO: ప్రమాదకర స్థితిలో వాటర్ ట్యాంక్

MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామ పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఓవర్‌హెడ్ నీటి ట్యాంక్ ప్రమాదకర స్థితికి చేరింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ట్యాంక్ పిల్లర్లలో పగుళ్లు ఏర్పడి, ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తరచూ సంచరించే ప్రాంతంలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.