మా ఊరికి బస్సు వెయ్యండి సారూ..!

NLG: బస్సు సౌకర్యం లేక బడికి వెళ్ళాలంటే రోజూ 6 కి.మీ నడిచి వెళ్ళాల్సి వస్తుందని నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కాచారం గ్రామానికి చెందిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడిచి వెళ్ళేటప్పుడు పుస్తకాలు బ్యాగులను మోయలేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి చొరవ తీసుకొని గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.