పన్ను బకాయిలపై ఎంపీడీవో సమీక్షా సమావేశం
కృష్ణా: గుడివాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో విష్ణు ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో విష్ణు ప్రసాద్ అధ్యక్షతన స్వర్ణ వెబ్‌సైట్‌లో పంచాయతీల టాక్స్, నాన్-టాక్స్ బకాయిల అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ పన్ను బకాయిలను త్వరితగతిన వసూలు చేసి, ఈనెల 10వ తేదీలోపు QR కోడ్ ద్వారా చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.