హత్య కేసు ఛేదించిన పోలీసులు
GNTR: మేడికొండూరులో ఇటీవల సంచలనం సృష్టించిన గోవిందరాజు హత్య కేసును ఛేదించారు. కుటుంబ ఆస్తి కోసమే గోవిందరాజును హత్య చేసినట్లు ఎస్పీ వకుల్ తెలిపారు. ఈ హత్యకు అతని భార్య లక్ష్మీ, ఆమె ప్రియుడు వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు ఖాసీం సైదా కలిసి కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. వీరు తాడుతో గోవిందరాజు గొంతు బిగించి చంపి, దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆయన తెలిపారు.