'ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి బాధాకరం'
SKLM: ఎచ్చెర్లలో ఉన్న ట్రీపుల్ ఐటీ క్యాంపస్‌లో గుంటూరుకు చెందిన సృజన్ అనే విద్యార్థి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ మాజీ MLA గొర్లె కిరణ్ కుమార్ క్యాంపస్‌ను సందర్శించారు. అనంతరం క్యాంపస్ డైరెక్టర్ బాలాజీతో సమావేశమై సంఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.