సీఎంఆర్ఎఫ్చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

W.G: ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యం చేయించుకునేందుకు అవకాశం లేని రోగులకు సీఎం సహాయ నిధి నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజవర్గంలో 11 మందికి సుమారు రూ.7 లక్షలు విలువైన చెక్కులను అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.