పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

W.G: పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్‌కు ఆదివారం సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి సందడి చేశారు. కుటుంబ సమేతంగా సముద్రస్నానాలు చేస్తూ, కెరటాల వద్ద సరదాగా గడిపారు. పలువురు యువకులు తీరం వద్ద ఆటలాడుకున్నారు. అనంతరం తీరం వెంబడి ఉన్న ఆలయాలను దర్శించుకున్నారు.