ALERT.. అబిడ్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

HYD: నగరంలోని పలుచోట్ల శనివారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామైంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ఈ ప్రభావంతో అబిడ్స్, జగదీశ్ మార్కెట్, మొజంజాహీ మార్కెట్, కోఠి రూట్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.