IFR కోసం సిద్ధమవుతున్న విశాఖ
VSP: నగరంలో భారత నౌకాదళం నిర్వహించే అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ నౌకాదళ వేడుకలలో ఒకటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR). 2026 ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం కోసం విశాఖ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 సాయంత్రం రామకృష్ణ బీచ్ వద్ద ఈ పరేడ్ జరుగుతుందని అదికారులు స్పష్టం చేశారు. 60కి పైగా దేశాల నౌకాదళాలు, విదేశీ యుద్ధనౌకలు మరియు ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు.