జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం
KMR: సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పెద్ద కొడప్గల్, బేగంపూర్, కాసలాబాద్, వడ్లం, బూరుగుపల్లి, సముందర్ తండా, జగన్నాథపల్లి, చిన్న తక్కడపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల తరఫున MLA తోట లక్ష్మీ కాంతారావు ప్రచారం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జుక్కల్‌ను విస్మరించినట్లు ఆయన విమర్శించారు. రెండేళ్లలోనే అభివృద్ధి పనులు చేపట్టామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.