ఎన్నికల్లో JSP 100% విజయం సాధించింది: MP
కృష్ణా: పామర్రులోని జనసేన ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ వేడుకలలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం సాధించి చరిత్ర సృష్టించిన పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు.