రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బీ. వర్షిణి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్టు పీడీ నవీన్ కుమార్ తెలిపారు. మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో వర్షిణి ప్రతిభ చాటారన్నారు. ఈనెల 26 నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో వర్షిణి పాల్గొంటారు.