VIDEO: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
KNR: మానకొండూర్ జడ్పీ హైస్కూల్లో 1987-88లో పదో తరగతి చదివిన విద్యార్థులు 37 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. సదాశివపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఈ సమ్మేళనానికి విద్యార్థులు కుటుంబ సమేతంగా హాజరై, తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.