అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MP, MLA

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MP, MLA

మేడ్చల్: రామంతపూర్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ అసెంబ్లీ వ్యాప్తంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని, స్థానికంగా తలెత్తుతున్న సమస్యలను, తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి పాల్గొన్నారు.