అధ్వానంగా కొండపల్లి రోడ్డు

NTR: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రహదారి గుంతలమయంగా మారింది. రైల్వే స్టేషన్, ప్రధాన బజారుకు వెళ్లే ఈ కీలక మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా ఉందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. రోడ్డుపై ఏర్పడిన గోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.