ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీకి సుధీర్ రెడ్డి

ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీకి సుధీర్ రెడ్డి

TG: HYDలో దోమల సమస్యకు వ్యతిరేకంగా LBనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దోమ తెర ధరించి, ఫాగింగ్‌ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని ఎమ్మెల్యేను మార్షల్స్‌ అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో కొత్త నిబంధనలు ఎక్కడివని ప్రశ్నించారు. దోమల తీవ్రతకు ప్రజలు హైదరాబాద్‌ నుంచి పారిపోతున్నారని అన్నారు.