వోల్టాస్‌కు రూ.23.52 కోట్ల డిమాండ్‌ నోటీసు

వోల్టాస్‌కు రూ.23.52 కోట్ల డిమాండ్‌ నోటీసు

ప్రముఖ ACల తయారీ సంస్థ Voltasకు కస్టమ్స్ విభాగం డిమాండ్ నోటీసు జారీ చేసింది. దిగుమతి వివరాలను తప్పుగా వెల్లడించిందని, మొత్తంగా రూ.23.52 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.10.76 కోట్ల డ్యూటీతో పాటు రూ.12.76 కోట్ల జరిమానా ఉంది. అయితే, ఈ నోటీసును ఖండించిన టాటా గ్రూప్‌నకు చెందిన వోల్టాస్.. సంబంధిత ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తామని స్పష్టం చేసింది.