మాజీ ఎంపీని కలిసిన అనుబంధ విభాగాల అధ్యక్షులు

ATP: వైసీపీ అనుబంధ సంఘాల నియామకాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు తలారి చరణ్, రైతు విభాగం అధ్యక్షుడు అభిలాష్ రెడ్డి ఆదివారం మాజీ ఎంపీ తలారి రంగయ్యను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.