మొబైల్ దొంగతనాలు చేసిన వ్యక్తి అరెస్ట్

HYD: సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆర్‌పీఎఫ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మొబైల్ దొంగతనాలు చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.