దారుణం.. మృతదేహన్ని సూట్ కేసులో పెట్టి..
మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. ప్రియాంక, వినోద్ అనే ఇద్దరు కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా వినోద్ తన ప్రియురాలిని గొంతు కోసి చంపేశాడు. తర్వాత శవాన్ని సూట్ కేసులో పెట్టి వాగులో పడేశాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు వినోద్‌ను అరెస్టు చేయగా.. విచారణలో నేరాన్ని అంగీకరించాడు.