జలమండలికి రూ.133.5 కోట్లు అందించాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ

జలమండలికి రూ.133.5 కోట్లు అందించాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ

హైదరాబాద్ అభివృద్ధి చెందినప్పటికీ పాత మురుగునీటి వ్యవస్థ కారణంగా డ్రైనేజీ సమస్యలు పెరిగినట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు, కొత్త కాలనీలు పెరగడంతో మురుగు నీరు చెరువులు, నదుల్లోకి చేరి జలకాలుష్యం పెరుగుతోందన్నారు. మల్కాజిగిరిలో సమస్య అత్యధికమని, శాశ్వత పరిష్కారం కోసం NRCD ద్వారా HMWSSBకు రూ.133.5 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు.