డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి

డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి

SDPT: పట్టణంలోని నాగదేవత ఆలయ సమీపంలో డివైడర్‌ను ఢీకొని యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు దుబ్బాకకు చెందిన మాడబోయిన రాంచరణ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.