VIDEO: ఎన్నికల కోలాహలం.. నామినేషన్ల పర్వం షురూ

VIDEO: ఎన్నికల కోలాహలం.. నామినేషన్ల పర్వం షురూ

సూర్యాపేట: మున్సిపల్ పోరుకు ముహూర్తం ఖరారైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో మున్సిపల్ ఆఫీస్ వద్ద రాజకీయ సందడి నెలకొంది. అభ్యర్థుల ర్యాలీలు, అనుచరుల హడావుడి దృష్ట్యా ఖాకీలు బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాలను తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.