ధరూర్ సమీపంలో లారీ బోల్తా

ధరూర్ సమీపంలో లారీ బోల్తా

వికారాబాద్ నుంచి తాండూర్ వైపు కంకర లోడుతో వెళ్తున్న లారీ బుధవారం తెల్లవారుజామున ధరూర్-గట్టెపల్లి మధ్య అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.