సౌతాఫ్రికాపై విజయం.. ఫైనల్‌కు భారత్

శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 337/9 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 314 పరుగులు చేసింది. దీంతో ఆదివారం శ్రీలంకతో జరగనున్న ఫైనల్‌లో భారత్ పోటీ పడనుంది.