నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: అశ్వారావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు నుంచి ఈ నెల 22 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం తెలిపారు. పట్టణంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసమే ఈ నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు.