మొక్కలకు సమయానికి నీరు అందించాలి: ఎంపీడీవో
MHBD: నెల్లికుదురు మండలంలోని నల్లగుట్ట తండా గ్రామపంచాయతీ నర్సరీలో బుధవారం సర్పంచ్ గుగులోత్ హేమలత అధ్యక్షతన మండల వన సేవకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీడీవో సింగారపు కుమార్ హాజరై, మాట్లాడుతూ.. నర్సరీలోని మొక్కలకు సమయానికి నీరు అందించి నిరంతరం వాటి పెరుగుదలకు కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.