BJP అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలి: కీర్తి రెడ్డి
BHPL: గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గొర్రె అనిత రవి గెలిపించాలని కోరుతూ ఇవాళ BJP రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కీర్తి రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, శుభ్రత, రోడ్లు, మహిళా సంక్షేమంలో అనిత రవి కట్టుబడి పనిచేస్తారని కీర్తి రెడ్డి పేర్కొన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆమెను గెలిపించాలని కోరారు.